ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం 

23 Sep, 2022 06:30 IST|Sakshi
నెల్లూరు జిల్లా కోటితీర్థంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు 

సాక్షి, నెట్‌వర్క్‌: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉత్సాహంగా సాగింది. ఇందులో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ..ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా తమకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ప్రజాప్రతినిధుల వద్ద పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇళ్లకు వస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు ప్రజలు వాడవాడనా ఎదురేగి స్వాగతం పలికారు. సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని దీవించారు.   

మరిన్ని వార్తలు