Giant Water Lilies: ఇంతింతై.. కొలనంతై 

24 Sep, 2021 13:59 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: కొలనులో తేలియాడుతున్న ఈ ఆకులను ఆరంభదశలో చూస్తే సాధారణ కలువ ఆకులనే అనుకుంటారు. కానీ రోజు రోజుకూ పెరిగిపోతూ అతి తక్కువ కాలంలోనే ఇవి భారీ పత్రాలుగా రూపుదిద్దుకుని చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మూడు నెలల వ్యవధిలో ఒక్కో ఆకు దాదాపు 2.5 మీటర్ల వెడల్పు పెరిగి 40 కేజీల వరకు బరువు మోయగలగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జెయింట్‌ వాటర్‌ లిల్లీ అనే ఈ మొక్కలు వైఎస్సార్‌ జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం బొటానికల్‌ గార్డెన్‌లో ఉన్నాయి. 


                                 కొలను నిండుగా పత్రాలు 


                                      నెమలి పింఛంలా ఉన్న పత్రం వెనుకభాగం

వైవీయూ బొటానికల్‌ గార్డెన్‌ నిర్వాహకులు డాక్టర్‌ ఎ. మధుసూదన్‌రెడ్డి 2019లో కలకత్తా బొటానికల్‌ గార్డెన్‌ నుంచి వీటిని తీసుకొచ్చారు. రెండు మొక్కలు తీసుకువచ్చి గార్డెన్‌లోని కొలనులో వేసి సంరక్షించగా ప్రస్తుతం దాదాపు 100 మొక్కలు వరకు పెరిగాయి. విక్టోరియా కృజియానా అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క 1800 సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది.  – వైవీయూ 


                                     మొక్క నాటిన తర్వాత తొలి దశలో పత్రాలు ఇలా..

మరిన్ని వార్తలు