ధవళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద

19 Aug, 2020 17:44 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీరు ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. బ్యారేజ్ వద్ద వరద 17.7 అడుగులకు తగ్గింది. దావరి వరద తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను తొలగించారు. ప్రస్తుతం అధికారులు బ్యారేజ్‌ గేట్లు ఎత్తి 18 లక్షల 99వేల క్యూసెక్కల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.ఇప్పటికే వరద నీటిలోనే 27 లంక గ్రామాలు మగ్గుతున్నాయి. 

భద్రాచలంలో  44 అడుగులకు చేరి  గోదావరి నీటి మట్టం ప్రవహిస్తోంది. భద్రాచలంలో వరద నీటిమట్టం తగ్గడంతో ఈ రోజు రాత్రికి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పనపల్లి బాలాజీ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. ఆంధ్ర అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ ఇంటిని వరద ముంచెత్తింది. కాగా రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దేవీపట్నం, తోయ్యరు, గొందురు వరద బాధితులకు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ధనలక్ష్మీ సందర్శించారు. అక్కడి భోజనం వసతిని గురించి ఆడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు