గుణదల మేరీ మాత ఉత్సవాలు 

9 Feb, 2023 05:44 IST|Sakshi
విద్యుత్‌ దీపాలంకరణతో మేరీ మాత ఆలయం

గుణదల(విజయవాడ తూర్పు):  ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ తిరునాళ్లకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. యాత్రికుల కోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా, రైల్వే అధికారులు గుణదల, రామవరప్పాడు స్టేషన్‌లలో పలు రైళ్లు నిలిచేందుకు అనుమతి ఇచ్చారు.  

పలు రైళ్లకు గుణదల, రామవరప్పాడు స్టేషన్లలో హాల్టింగ్‌ 
గుణదల మేరీ మాత ఉత్సవాల సందర్భంగా.. 
రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లా విజ­య­వాడలో ఈ నెల 9 నుంచి 11 వరకు జరిగే మేరీ మాత ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్ధం పలు రైళ్లకు గుణదల, రామవరప్పాడు స్టేషన్లలో హాల్టింగ్‌ సదుపాయం కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ అధికారులు ప్రకటించారు.  

గుణదల స్టేషన్‌లో నిలిచే రైళ్లు..  
► రైలు నంబర్‌ 17289 తిరుపతి–కాకినాడ టౌన్‌  
►రైలు నంబర్‌ 17250 కాకినాడ టౌన్‌–తిరుపతి  
►రైలు నంబర్‌17257 విజయవాడ–కాకినాడ పోర్టు  
►రైలు నంబర్‌ 17258 కాకినాడ పోర్టు–విజయవాడ  
►రైలు నంబర్‌ 07768 విజయవాడ–రాజమండ్రి  
►రైలు నంబర్‌ 07767 రాజమండ్రి–విజయవాడ
రామవరప్పాడు స్టేషన్‌లో నిలిచే రైళ్లు..  
►రైలు నంబర్‌ 07867 మచిలీపట్నం–విజయవాడ  
►రైలు నంబర్‌ 07861 విజయవాడ–మచిలీపట్నం. 

మరిన్ని వార్తలు