వియత్నాంకు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌

31 Aug, 2021 04:41 IST|Sakshi
కోవిడ్‌ వైద్య సామగ్రితో వియత్నాంకు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ నౌక

100 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్, కోవిడ్‌ వైద్య సామగ్రి చేరవేత

దొండపర్తి (విశాఖ దక్షిణ): మిషన్‌ సాగర్‌ కార్యక్రమంలో భాగంగా కోవిడ్‌ వైద్య సామగ్రితో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ నౌక వియత్నాంలో ఉన్న హో ఛీ మిన్‌ సిటీ పోర్ట్‌కు సోమవారం చేరుకుంది. వియత్నాం ప్రభుత్వ కోరిక మేరకు భారత్‌ నుంచి 100 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌తో పాటు 300 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఇతర కోవిడ్‌ సామగ్రిని నౌక ద్వారా తరలించారు. మిత్ర దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇప్పటికే భారత్‌ ఈ ఏడాదిలో రెండు సార్లు ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ నౌక ద్వారా లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను, వైద్య సామగ్రిని ఇండోనేషియాకు పంపించింది. 

మరిన్ని వార్తలు