108 సిబ్బందికి కమిషనర్‌ అభినందన

10 Nov, 2021 05:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఏఎన్‌ఎం, ఈఎంటీలకు నగదు బహుమతి 

సాక్షి, అమరావతి: అంబులెన్స్‌ (108)లో గర్భిణికి ప్రసవం చేసిన ఏఎన్‌ఎం, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈఎంటీ)లను వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 3వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం రెంటికోట పీహెచ్‌సీ పరిధిలో పురిటి నొప్పులతో బాధపడుతున్న సవర మహేశ్వరిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం లేకపోవడంతో ఏఎన్‌ఎం రాజేశ్వరి, ఈఎంటీ సత్యం 108లోనే కాన్పు చేశారు. కమిషనర్‌ మంగళవారం వీరిని అభినందించడంతోపాటు ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు బహుమతి ప్రకటించారు.

మరిన్ని వార్తలు