మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి

6 Aug, 2020 20:11 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ప‌్రాణాపాయంలో ఉన్న యువ‌కుడికి ప్రాథ‌మిక చికిత్స చేసి తాడికొండ ఎమ్మెల్యే డాక్ట‌ర్ శ్రీదేవి మాన‌వ‌త్వం చాటుకున్నారు. ఆమె గురువారం హైద‌రాబాద్ వెళ్తుండ‌గా పిడుగురాళ్ల ద‌గ్గ‌ర ఓ లారీ బైకును ఢీ కొట్టిన దృశ్యం కనిపించింది. బైకు పై ఉన్న వ్య‌క్తి తీవ్ర‌గాయాల‌తో రోడ్డుపై ప‌డిపోయి క‌నిపించాడు. క‌రోనా భ‌యంతో అక్క‌డున్న స్థానికులు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో అటుగా వ‌చ్చిన‌ ఎమ్మెల్యే శ్రీదేవి వెంట‌నే బాధితుడి చెంత‌కు చేరారు. గాయాల‌పాలైన యువ‌కుడికి ముందుగా ప్రాథ‌మిక చికిత్స చేశారు. అనంత‌రం ఆమె పోలీసులు, 108కు స‌మాచార‌మిచ్చారు. వారు వ‌చ్చేంత‌వ‌ర‌కు అక్క‌డే ఉండి, ఆ త‌ర్వాత ఎమ్మెల్యే అక్క‌డి నుంచి వెళ్లిపోయారు (రెండు రోజులే క‌స్ట‌డీకి అనుమ‌తి)

చ‌ద‌వండి: నిర్భయ కేసులో జేడీఏ హబీబ్‌బాషా అరెస్టు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు