సీబీసీఐడీ స్పెషల్‌ కోర్టుకు ఎంపీ రఘురామ

15 May, 2021 16:35 IST|Sakshi

సాక్షి, అమరావతి :  ఎంపీ రఘురామకృష్ణరాజును అధికారులు సీబీసీఐడీ స్పెషల్‌ కోర్టులో హాజరుపర్చారు. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్‌ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు. ఈ ఉదయం రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. 

రఘురామ అరెస్ట్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్‌ కావాలంటే కింది కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అదే సమయంలో రఘురామకృష్ణరాజుతో పాటు TV5, ABNలపై కూడా సీఐడీ కేసులు నమోదు చేసింది. A1గా రఘురామకృష్ణరాజు, A2గా TV5, A3గా ABNలపై కేసులు ఫైల్‌ చేసింది. 

చదవండి: రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు

ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ

మరిన్ని వార్తలు