తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం

5 Jul, 2021 08:19 IST|Sakshi
రాజ్యలక్ష్మీపురంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న పుష్పశ్రీవాణి

ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి 

కొమరాడ (విజయనగరం)/పద్మనాభం (భీమిలి): అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేసిన లంబసింగికి సమీపంలోని తాజంగిలో అల్లూరిని శాశ్వతంగా స్మరించుకునేలా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంను ప్రభుత్వం నిర్మించనుందని ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.35 కోట్లతో నిర్మించనున్న తాజంగి మ్యూజియం నిర్మాణానికి సీఎం జగన్‌ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఆమె చెప్పారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని కంబవలస పంచాయతీ రాజ్యలక్ష్మీపురంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వైఎస్సార్‌ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు ఆమె శంకుస్థాపనలు చేశారు.

అల్లూరి మ్యూజియం
విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని పాండ్రంగిలో ఆదివారం ప్రభుత్వ పరంగా నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల్లో విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాట్లాడారు. పాండ్రంగిలో అల్లూరి పేరు మీద రూ.3 కోట్లతో మ్యూజియాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు