జోడెద్దుల ఊయ్యాల.. హాయిగా నిద్రపోవాల!

23 Jun, 2022 18:23 IST|Sakshi

సాక్షి, బేతంచెర్ల: కాడెద్దుల పట్టెడలకు చీరతో ఊయల. అందులో ఆదమరిచి నిద్రపోతున్న ఓ చిన్నారి.. ఓ రైతు కుటుంబం తమ బిడ్డను ఈ విధంగా నిద్రకేసి ఎంచక్కా వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు.


ఎద్దులు అడుగు తీసి అడుగేసినప్పుడల్లా ఊయల ఊగుతుండగా.. జోలపాటలా వస్తున్న ఎద్దుల మెడలోని గంటల సవ్వడికి ఆ చిన్నారి హాయిగా నిద్రపోతోంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురంలోని ఓ రైతు జంట తమ బిడ్డను ఈ విధంగా నిద్రపుచ్చుతున్న సన్నివేశం సాక్షి కెమెరాకు చిక్కింది. (క్లిక్‌: అర్ధసత్యాల ఆంధ్రజ్యోతి)

మరిన్ని వార్తలు