ఉధృతంగా పాలేరు వాగు.. రాకపోకలు బంద్

18 Jul, 2021 10:34 IST|Sakshi

మహానంది మండలంలో పాలేరు వాగు ఉధృతి

మహానంది-గాజులపల్లి మధ్య రాకపోకలు బంద్ 

సాక్షి, కర్నూలు: గత కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో మహానంది మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మహానంది-గాజులపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. గుంటూరు ఎన్జీవో కాలనీలో 14.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. కదిరిలో రికార్డుస్థాయిలో 21 సెం.మీ, రామకుప్పం మండలం బండారుపల్లెల్లో 10.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.

చిత్తూరు: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా వర్షాలు అడపాదడపా కురుస్తూనే ఉన్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు తిరుమలకొండలు  తడిచి ముద్దవుతోంది. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, మాడా వీధులు జలమయం అయ్యాయి. కాటేజీల ఆవరణలో వర్షుపు నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాల్లో నీటితో నిండిపోయాయి. ఘాట్ రోడ్డు ప్రకృతి అందాలను సంతరించుకుంది. భారీ వర్షాలకు చలి తీవ్రత తోడుకావడంతో భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముప్పు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

ఘాట్ రోడ్డులో అక్కడక్కడా  కొండ చరియలు విరిగి పడుతున్నాయి. మరోపక్క జలాశయాలలో వర్షపు నీరు చేరుతుంది. నీటిమట్టం పెరుగుతుంది. ఇప్పటికే భక్తులు తక్కవ సంఖ్యలో తిరుమల కి వస్తున్నారు. కరోనా వైరస్ శ్రీవారి దర్శనాల సంఖ్యను టిటిడి తగ్గించింది. దీంతో నీటి వినియోగం కూడా తగ్గింది. మరోపక్క వర్షాలు కూడా సకాలంలో కురుస్తుంది. దీంతో మరో ఎడాదిన్నర పాటు తిరుమలలో నీటి కొరత ఉండే అవకాశం లేదు  అంటున్నారు అధికారులు. తిరుమలలో ఐదు జలాశయాలు ఉన్నాయి. గోగర్బం, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార,పసుపు ధార డ్యాములలో వర్షపు నీటితో నిండుతున్నాయు. జలాశయాలలో నీరు చేరడంతో పరిసర ప్రాంతాలన్ని అందాలను సంతరించుకుంది. 

మరిన్ని వార్తలు