AP: రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

29 Oct, 2023 04:52 IST|Sakshi

ఉరుములు, మెరుపులకు ఆస్కారం 

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొన్నాళ్లుగా వాతావరణం పొడిగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల ఉక్కపోత ఉంటోంది. తాజాగా గాలుల దిశ మారిన కారణంగా తూర్పు, ఆగ్నేయ గాలులు రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నా­యి.

అదే సమయంలో తేలికపాటి జల్లులు లేదా వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణశాఖ శనివారం ఓ నివేదికలో తెలిపింది. రానున్న మూడు రోజుల్లో కో­స్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల జల్లులు కుర­వవచ్చని పేర్కొంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులకు ఆస్కారం ఉందని అంచనా వేసింది.  

మరిన్ని వార్తలు