సైనిక్‌ స్కూల్, కలికిరిలో 18 ఖాళీలు

22 Jul, 2021 18:43 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు  చెందిన కలికిరి సైనిక్‌ స్కూల్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 18
► పోస్టుల వివరాలు: టీజీటీ–02, ఎల్‌డీసీ–02, ఎంటీఎస్‌–14 తదితరాలు.

టీజీటీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ/బీఏ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 21 నుంచి 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు ఉంటుంది.

ఎల్‌డీసీ: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 18 నుంచి 50ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది.

ఎంటీఎస్‌: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18నుంచి 50ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021

► వెబ్‌సైట్‌: https://sskal.ac.in

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు