వైఎస్‌ జగన్‌ పాలన దేశానికే మార్గదర్శకం

16 Aug, 2020 04:58 IST|Sakshi
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి

స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న పాలన దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా పేద ప్రజలను ఆదుకోవడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన 74వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సజ్జల మాట్లాడుతూ..‘ వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో స్వర్ణయుగం ప్రారంభమైంది. అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి.

80 శాతం మందికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరింది’ అని చెప్పారు. ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా ఈ రోజు పేదలకు సంపూర్ణ స్వాతంత్య్రం లభించేదని.. కానీ టీడీపీ కుయుక్తుల వల్ల అది వాయిదా పడిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, నేతలు ఎన్‌.పద్మజ, ఎ.నారాయణమూర్తి, బొప్పన భవకుమార్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు