చంద్రబాబుకు మరోసారి ‘జూనియర్‌’ సెగ

15 Jul, 2021 04:18 IST|Sakshi
చంద్రబాబుకు పర్యటనలో దర్శనమిచ్చిన నెక్స్‌›్ట సీఎం జూనియర్‌ ఎన్టీఆర్‌ జెండాలు

చంద్రబాబుకు షాకిచ్చిన కార్యకర్తలు

చిలకలపూడి (మచిలీపట్నం):  ప్రతిపక్ష నేత చంద్రబాబు బుధవారం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో పర్యటించారు. మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు (పెదబాబు) ఏప్రిల్‌ ఒకటో తేదీన మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను, అల్లుడైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పరామర్శించేందుకు ఆయన నివాసానికి చంద్రబాబు విచ్చేశారు. ఈ పర్యటనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ జెండాలతో స్వాగతం పలుకుతారనుకుంటే అక్కడ సీన్‌ మారింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ బొమ్మతో ఉన్న జెండాలు ప్రత్యక్షమయ్యాయి.

నెక్స్ట్ సీఎం జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ జెండాలు రెపరెపలాడాయి. అనంతరం సర్కిల్‌పేటలోని పెదబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. కొద్దిసేపు నాయకులతో ముచ్చటించి అనంతరం పెడన నియోజకవర్గం నాగేశ్వరరావుపేట బయల్దేరి వెళ్లారు. ఈ పర్యటనలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు