కాటేసిన కరోనా.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి 

29 May, 2021 11:53 IST|Sakshi
కృష్ణంనాయుడు, చిన్నమ్మడమ్మ, జానకమ్మ (ఫైల్‌)

మెట్టవలసలో విషాదం 

జి.సిగడాం: కన్నీటి సిరాతో కరోనా రాస్తున్న విషాద గాథలకు అంతులేకుండా పోయింది. నిత్యం వేలాది మందిని మింగేస్తోన్న మహమ్మారి జిల్లాలోనూ ఆరని కాష్టాన్ని రగిల్చింది. ఆ రక్కసి ఆకలికి మెట్టక్కివలసలో ఓ కుటుంబం నిలువునా బలైపోయింది. ముందుగా ఇల్లాలు అనంతరం భర్త, ఆ తరువాత కుమార్తెలను చంపి తన వికృతత్వాన్ని చాటుకుంది. ఈ విషాదం చెప్పేదొకటే కరోనా మనం జోకులు వేసుకునేంత సామాన్యమైనది కాదు. పట్టు చిక్కిన నాడు పదుల సంఖ్యలో ప్రాణాలను అవలీలగా తీసేస్తోంది. ఆనందాలను ధ్వంసం చేసి ఆయుష్షును తగ్గించేస్తోంది.

ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన డకర కృష్ణనాయుడు (63), భార్య చిన్నమ్మడమ్మ (58), కుమార్తె జానకమ్మ (39) కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. వీరిలో చినమ్మడమ్మ ఇంటివద్దనే చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 29వ తేదీ చనిపోయారు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే కృష్ణంనాయుడు కూడా ఇంటి వద్దే ఈ నెల తొమ్మిదో తేదీన ఇంటి వద్దే ప్రాణాలు కోల్పోయాడు. దంపతుల మరణంతో కుటుంబ సభ్యులతోపాటు స్థానికులంతా తీవ్ర విషాదానికి గురయ్యారు. ఇంతలోనే ఆ ఇంట్లో మరో ఘోరం చోటుచేసుకుంది. జానకమ్మ కూడా ఈ నెల 24వ తేదీన శ్రీకాకుళంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

చదవండి: కోవిడ్‌కు బహుదూరం.. బవురువాక   
ముగ్గురు చిన్నారులకు ‘రూ.10 లక్షల’ పరిహారం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు