తిరుపతిలో దారుణం.. భర్తకి భార్య ప్రియుడి శిరోముండనం, చెప్పుకోలేని రీతిలో అవమానం

4 Mar, 2023 08:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య వివాహేతర సంబంధం గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు ఓ భర్త. తమ గుట్టును బయటపెట్టడం భరించలేని ఆమె ప్రియుడు.. ఆ భర్తపై పైశాచిక చేష్టలకు దిగాడు. ఆ భర్తకి శిరోముండనం చేసి.. మూత్రం పోశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.

చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో ఈ షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో హర్షవర్థన్‌ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడని, రిప్‌(RIP) అంటూ ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు. అది చూసిన ఆ ప్రియుడు హర్షవర్ధన్‌ రగిలిపోయాడు. బాధిత భర్తను దొరకబుచ్చుకుని గుండు కొట్టించాడు. ఆపై అతనిపై మూత్రం పోశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ అతన్ని బెదిరించారు కూడా. అయితే..

ఈ చేష్టలను అడ్డుకోకపోగా.. కొందరు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. దీంతో పోలీసులకు విషయం చేరింది. ఈ దారుణానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ధృవీకరించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి హర్షవర్దన్‌తో పాటు అతని అనుచరుడు అన్వర్‌ను, వీళ్లకు సహకరించిన మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మరోవైపు జరిగిన అవమానంతో బాధిత భర్త అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు