పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. చివరికి ట్విస్ట్‌

10 Aug, 2022 07:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వేంపల్లె(వైఎస్సార్‌ జిల్లా): ఇద్దరు మహిళలు వివాహం చేసుకున్న ఘటన వైఎస్సార్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఎవరిళ్లకు వారిని పంపించివేశారు. కమలాపురం నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు, పెండ్లిమర్రి మండలం మిట్టమీదపల్లెకు చెందిన వ్యక్తితో ఏడాది కిందట వివాహమైంది. వారి మధ్య మనస్పర్థలున్నాయి.
చదవండి: మాజీ ఎంపీ హర్షకుమార్‌ కుమారుడి నిర్వాకం.. యువతిపట్ల అసభ్యకర ప్రవర్తన

మహిళకు తమ బంధువైన వేంపల్లె రాజీవ్‌ కాలనీకి చెందిన మరో మహిళతో పరిచయమేర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో గత శనివారం వీరిద్దరూ వెళ్లిపోయి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వివాహం చేసుకున్నారు. మంగళవారం వేంపల్లె పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. సీఐ సీతారామిరెడ్డి వారిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి, వారి బంధువులను పిలిపించి అప్పగించారు.   

మరిన్ని వార్తలు