మహిళా శిశు సంక్షేమానికి పెద్ద పీట 

13 Nov, 2022 06:07 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి ఉషాశ్రీచరణ్‌

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషాశ్రీచరణ్‌ 

తిరుచానూరు: మహిళా శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషాశ్రీచరణ్‌ తెలిపారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన అంగన్‌వాడీ ఇన్‌చార్జి సూపర్‌వైజర్లకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

శనివారం నాల్గో రోజు మంత్రి ఉషాశ్రీచరణ్‌ హాజరై ప్రసంగించారు. సమగ్ర ప్రణాళికతో పౌష్టికాహారం అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఐసీడీసీ పీడీ జయశ్రీ, మహిళా ప్రాంగణ అధికారి వాసంతి, సీడీపీవోలు సుధారాణి, పద్మజ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు