‘అందుకే సబ్బం హరి నిర్మాణాన్ని తొలగించాం’

3 Oct, 2020 16:32 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : అనుమతులకు విరుద్ధంగా మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి నిర్మాణం చేపట్టారని విశాఖ మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు. సబ్బంహరి అక్రమ నిర్మాణానికి సంబంధించి విశాఖ కమిషనర్‌ ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. ఇందులో పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని సెప్టెంబర్‌ 5న ఏపీఎస్‌ఈబీ కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సీతమ్మధారలోని రేసపువానిపాలెం సర్వే నెం.7లో ఏపీఎస్‌ఈబీ పార్కు ఉందన్నారు. 2012లో ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి తీసుకున్న సబ్బం హరి 592.93చ.మీ విస్తీర్ణంలో జీ+1 కోసం అనుమతి తీసుకున్నారని తెలిపారు. ()సబ్బం హరికి ఝలక్‌.. జేసీబీతో కూల్చివేత)

ఇంటి ముఖం 58 ఫీట్లకు అనుమతి తీసుకుని 70 ఫీట్లు కట్టినట్లు వెల్లడించారు. మొత్తం మీద పార్క్‌లోని 212 గజాలను ఆక్రమించిన సబ్బం హరికి ఆక్రమణలకు సంబంధించి 406 సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులు తీసుకోవడానికి ఆయన నిరాకరించడంతో నోటీసులను సబ్బం హరి భవనానికి కమిషనరేట్‌ సిబ్బంది అతికించారు. నోటీసులకు ఏమాత్రం పట్టించుకోకపవంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన అధికారులు మాజీ ఎంపీకి ఝలక్‌ ఇచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు.

కాగా  సీతమ్మధారలో మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి వద్ద పార్కు స్థలం కబ్జాకు గురైందని వైజాగ్ జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాన్ని తొలగించామని వెల్లడించారు. ముందుగా సబ్బం హరికి ఆక్రమణ నోటీసు ఇచ్చాము కానీ ఆయన తీసుకోలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు