విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి సూసైడ్‌ నోట్‌ కలకలం

20 Mar, 2021 13:47 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి సూసైడ్‌ నోట్‌ కలకలం సృష్టించింది. సూసైడ్ నోట్ రాసి.. ఉద్యోగి శ్రీనివాస్‌ కనిపించకుండా పోయారు. సాయంత్రం 5:49 నిమిషాలకు ఫర్నేస్‌లో దూకి అగ్నికి ఆహుతి కాబోతున్నట్లు లేఖలో పేర్కొనడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. గాజువాక సింహగిరి కాలనీలో నివాసముంటున్న శ్రీనివాస్.. స్టీల్ ప్లాంట్‌లోని వ్తెర్ రాడ్ మిల్ విభాగంలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో స్టీల్ ప్లాంట్‌ను స్ట్రేటజిక్ సేల్ ప్రకటన రావడంతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు 35 రోజులు దాటినా కేంద్రం దిగి రాకపొవడంతో ప్లాంట్ ప్రైవేట్‌ పరమవుతుందని ఆందోళన చెందిన శ్రీనివాస్.. ఈ క్రమంలో రాత్రి ‘సి’ షిఫ్ట్‌కు వెళ్ళారు. అక్కడే సూస్తెడ్ నోటు రాసి అందరికీ షేర్ చేసాడు. ఆందోళన చెందిన కార్మికులు వ్తెర్ రాడ్ మిల్స్, ఫర్నేష్ ప్రాంతాల్లో ఆరా తీశారు. అదే సమయంలో పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు. ప్లాంట్‌లోనే శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.


చదవండి:
భర్త చేష్టలతో విసుగుచెంది...
బిడ్డల గొంతునులిమి చంపేశా.. నన్నెందుకు బతికించారు

మరిన్ని వార్తలు