నాణ్యమైన విద్యే లక్ష్యం

14 Nov, 2023 01:26 IST|Sakshi
చిన్నారులకు విద్యాబోధన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్త

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. పిల్లలకు మంచి విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకుసాగుతున్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల పనితీరును పర్యవేక్షించే సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు పిల్లలకు ఇచ్చే విద్యాబోధనలో నాణ్యత, మెలకువలపై శిక్షణ ఇస్తున్నారు. అందుకోసం పూర్వ ప్రాథమిక విద్యాబోధనపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న తమ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.

ఆరు రోజులపాటు శిక్షణ

వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాల్లో పనిచేస్తున్న ఐసీడీఎస్‌ సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు కడప నగరంలోని గ్లోబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఒక్కొ బ్యాచ్‌లో 50–60 మంది చొప్పున ఒక్కొ బ్యాచ్‌కు ఆరు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే మూడు బ్యాచ్‌లు చొప్పున శనివారంతో శిక్షణ పూర్తయింది.

జిల్లాలో 13 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు

వైఎస్సార్‌ జిల్లాలో కడప అర్బన్‌, చింతకొమ్మదిన్నె, కమలాపురం, వేంపల్లె, ముద్దనూరు, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు అర్బన్‌, ప్రొద్దుటూరు రూరల్‌, మైదుకూరు, చాపాడు, బద్వేలు, పోరుమామిళ్ల ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2389 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పర్యవేక్షణకు 11 మంది ఐసీడీఎస్‌ సీపీడీఓలు, 92 మంది సూపర్‌వైజర్లు ఉన్నారు. వీరి పరిధిలో 14,888 మంది గర్భిణులు, 14,239మంది బాలింతలు, 7 నెలల నుంచి మూడేళ్ల వరకు 73,804 మంది చిన్నారులు, 3–6 సంవత్సరాల మధ్య 42,233 మంది పిల్లలు ఉన్నారు.

కాన్వెంట్లకు దీటుగా విద్యాబోధన

ప్రైవేటు కాన్వెంట్ల కన్నా ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో బోధన ఉండేలా ప్రీ స్కూలు యాక్టివిటీ (పూర్వ ప్రాథమిక విద్య)పై శిక్షణ ఇస్తున్నా రు. ఇంకా ఎక్కువ మంది పిల్లలు కేంద్రాలకు వచ్చేలా శిక్షణా విధానం ఉండగా, ప్రీ స్కూలు కిట్లను కూడా ప్రభుత్వం అందించనుంది.

అంగన్వాడీ కేంద్రాల్లో

ఉత్తమ బోధనకు ప్రభుత్వ చర్యలు

ప్రీ స్కూలు యాక్టివిటీపై

సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు శిక్షణ

వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాలకు కలిపి కార్యక్రమం

మరిన్ని వార్తలు