వీరభద్రుడికి పల్లకీ సేవ

14 Nov, 2023 01:26 IST|Sakshi
మాట్లాడుతున్న దండు వీరయ్య మాదిగ

రాయచోటిటౌన్‌ : దీపావళి పర్వదినం సందర్భంగా ఆదివారం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆదివారం రాత్రి స్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి, అమ్మవారికి రంగు రంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో ఉంచి ఆలయ మాఢవీధులలో ఊరేగించారు. ఈ పల్లకీ సేవలో ఆలయ ప్రధాన అర్చకులు, సిబ్బంది, అధికారులంతా సంప్రదాయ దుస్తులు ధరించి స్వామి పల్లకీ సేవ నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ పాలక మండలి అధ్యక్షులు పోలం రెడ్డి విజయ, ఆలయ ఈవో డివి రమణారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు.

క్రికెట్‌ ప్రేమికులకు ‘కను’విందు

కడప స్పోర్ట్స్‌ : క్రికెట్‌ వరల్డ్‌ కప్‌–2023లో భాగంగా సెమీఫైనల్‌ మ్యాచ్‌లో తలపడనున్న ఇండియా–న్యూజిలాండ్‌ మ్యాచ్‌ను కడప ప్రజలు వీక్షించేందుకు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్‌ కళాశాల) మైదానంలో ఆంధ్రా క్రికెట్‌అసోసియేషన్‌, క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ వైఎస్‌ఆర్‌ డిస్ట్రిక్ట్‌ ఆధ్వర్యంలో ‘ఫ్యాన్‌ పార్క్‌’ పేరుతో భారీ స్క్రీన్‌ ఏర్పాటు చేసి మ్యాచ్‌ను తిలకించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఏవైడీ కార్యదర్శి అవ్వారు రెడ్డిప్రసాద్‌ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి లైవ్‌ మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించవచ్చని తెలిపారు. క్రికెట్‌ అభిమానులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కబడ్డీలో వైవీయూ సత్తా

వైవీయూ : జేఎన్‌టీయూ కాకినాడలో ఈనెల 9 నుంచి 12 వరకు నిర్వహించిన దక్షిణ భారత అంతర్‌ విశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీల్లో యోగివేమన విశ్వవిద్యాలయం కబడ్డీ జట్టు జయకేతనం ఎగురవేసింది. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు తలపడిన ఈ పోటీల్లో వైవీయూ పురుషుల జట్టు మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. దీంతో పాటు ఆలిండియా అంతర్‌ విశ్వవిద్యాలయ కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. వైవీయూ వీసీ చింతా సుధాకర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌. రఘునాథరెడ్డి, క్రీడాబోర్డు కార్యదర్శి డా. కె. రామసుబ్బారెడ్డి అభినందనలు తెలిపారు.

26న రజక ఆత్మ గౌరవ సభ

కడప సెవెన్‌ రోడ్స్‌ : రజక ఆత్మ గౌరవ సభ ఈ నెల 26 తేదీ గుంటూరులో జరుగుతుందని రజక సంఘాల ఐక్యవేదిక జిల్లా నాయకుడు అర్కటవేముల జయరాముడు తెలిపారు. సోమవారం కడప నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో ఆత్మ గౌరవ సభకు సంబఽఽఽంఽధించిన పోస్టర్లను విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు పిలుపుమేరకు జరగనున్న ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో రజకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐక్య వేదిక జిల్లా నాయకులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం

కడప సెవెన్‌రోడ్స్‌ : దళితమిత్ర సంఘం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక సోమవారం కడప నగరంలోని తిలక్‌నగర్‌లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా కె.బాబు, ఉపాధ్యక్షుడిగా పొన్నోలు బాలసుబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా మామిడి రామసుబ్బయ్య, కోశాధికారిగా చెన్నూరు విజయ్‌, కార్యదర్శులుగా గోవిందు, ఉపేంద్రలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర దళితమిత్ర అధికార ప్రతినిధి పెడబల్లె నాగభూషణం, వ్యవస్థాపక అధ్యక్షులు కె.రామాంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దళితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా సామాజిక న్యాయం కోసం కొత్త కార్యవర్గం కృషి చేయాలని కోరారు. దళిత మిత్ర సంఘం యువజన రాష్ట్ర అధ్యక్షులు నరహరి పాల్గొన్నారు.

అది మోదీ సభ

ముద్దనూరు : హైదరాబాదులో జరిగిన మాదిగల విశ్వరూప సభ నరేంద్ర మోదీ సభలా వుందని ఏపీ ఎమ్మార్పీయస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండువీరయ్య మాదిగ విమర్శించారు. ఆదివారం ఆయన ముద్దనూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ రెండు రాష్ట్రాలలో సు మారు ఒకటిన్నర కోటి మంది మాదిగలున్నా కేవలం లక్ష మంది హాజరయ్యారని, అది కేవ లం బీజేపీ విశ్వరూప మహాసభ అని ఆయన విమర్శించారు. ఒక రాజకీయపార్టీకి మన కులాన్ని తాకట్టుపెట్టినట్టుందని, ఢిల్లీలో బిల్లు పెట్టాల్సిన ప్రధాన మంత్రి హైదరాబాదుకు వచ్చి మీలో ఒకడిని అని చెప్పడం విడ్డూరమని ఆయన విమర్శించారు. ఎమ్మార్పీయస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్లయ్య మాదిగ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు