Sakshi News home page

వెలుగు జిలుగులు

Published Tue, Nov 14 2023 1:26 AM

పులివెందులలో బాణసంచా వెలుగులు - Sakshi

వైభవంగా దీపావళి

కడప కల్చరల్‌ : దీపావళి పర్వదినాన్ని ప్రజలు ఆదివారం వైభవంగా నిర్వహించుకున్నారు. సా యంత్రం 6.00 గంటలకే వీధులన్నీ లక్ష్మి పటాసుల ధ్వనులతో మార్మోగాయి. పిల్లల అల్లరిని సూచిస్తూ తారాజువ్వలు రివ్వుమని ఆకాశానికి ఎగిరాయి. పెద్దల ఆనందానికి ఉదాహరణగా మతాబులు, చిచ్చుబుడ్లు, వెలుగులు చిమ్మాయి. పెద్దల ఆధ్వర్యంలో పిల్లలు కట్టలు తెగిన సంతోషంతో ఉత్సాహం ఉరకలేస్తుండగా టపాసులు కాల్చారు. ఉత్సాహం ఎక్కువైన పిల్లలు, యువకులు రోడ్లపైనే తారాజువ్వలు, లక్ష్మిబాంబులు పేలుస్తుండడంతో వాహనదారులు ఒకింత అసౌకర్యానికి గురయ్యారు. అయినా పిల్లల నుంచి వృద్ధుల వరకు టపాసులు కాల్చుస్తూ ఉత్సాహంగా గడిపారు. పిల్లలు పట్టుబట్టడంతో మతబేధాలు లేకుండా అందరూ టపాసులు కాల్చుకున్నారు. హిందువుల ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గు లు వేసి దీపాలు తీర్చారు. కాంపౌండ్‌ గోడలపై దీపాల వరుసలు కనుల పండుగ చేశాయి.

Advertisement

What’s your opinion

Advertisement