రాశిఫలాలు: ఈ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి

30 Nov, 2023 05:09 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: బ.తదియ ప.2.06 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: ఆరుద్ర ప.3.31 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: తె.4.19 నుండి 5.59 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం: ఉ.9.57 నుండి 10.45 వరకు, తదుపరి ప.2.26 నుండి 3.07 వరకు, అమృత ఘడియలు: లేవు, సంకటహర చతుర్థి. యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు, రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు,సూర్యోదయం :6.16, సూర్యాస్తమయం:  5.20.

మేషం.... ఆర్థికాభివృద్ధి. పనుల్లో పురోగతి. చిత్రమైన సంఘటనలు. ఇంటాబయటా అనుకూలం. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.

వృషభం.... రుణఒత్తిడులు.  శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.

మిథునం.... ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.  ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం.... ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. వృథా ఖర్చులు. ఆలయాలు సందర్శిస్తారు.

సింహం.... ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

కన్య..... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు. సన్నిహితులు సహాయపడతారు. కాంట్రాక్టులు పొందుతారు.

తుల... ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు ఒత్తిడులు. బంధువులతో మాటపట్టింపులు.

వృశ్చికం.... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దూరప్రయాణాలు. ఉద్యోగులకు గందరగోళం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక చింతన.

ధనుస్సు... కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం..... కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కుంభం.... కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా. శ్రమాధికం. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం.... వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఒప్పందాలు వాయిదా. ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యం.

మరిన్ని వార్తలు