ఈ రాశివారికి సన్నిహితులతో విభేదాలు

8 Nov, 2021 06:20 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌:

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం,శరదృతువు, కార్తీక మాసం తిథి శు.చవితి సా.6.14 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం మూల రా.12.23 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం ఉ.9.29 నుండి 10.57 వరకు, తిరిగి రా.10.55 నుండి 12.23వరకు దుర్ముహూర్తం ప.12.06 నుండి 12.51 వరకు, తదుపరి ప.2.21 నుండి 3.07 వరకు, అమృతఘడియలు.సా.6.24 నుండి 7.32 వరకు, నాగుల చవితి.

సూర్యోదయం :    6.05
సూర్యాస్తమయం    :  5.24
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు

రాశి ఫలితాలు:

మేషం... వ్యవహారాలలో ప్రతిబంధకాలు. కొత్త రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం... పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు. అనుకోని ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం... శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం... పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాల విస్తరణ సఫలం. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

సింహం... శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కన్య... మిత్రులతో విరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

తుల... శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. భూవివాదాలు. పరిష్కారం. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

వృశ్చికం... సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. భూవివాదాలు. సోదరుల నుంచి సమస్యలు. వ్యాపారాలు మరింత నిదానిస్తాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు.

ధనుస్సు... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం... వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పనుల్లో  ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కుంభం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. కొన్ని సమస్యలు తీరతాయి. స్థిరాస్తి లాభం. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మీనం... నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి పిలుపు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మరిన్ని వార్తలు