ఈ రాశి వారు ఆస్తులు కొంటారు.. పరపతి పెరుగుతుంది

15 Dec, 2021 06:16 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.ద్వాదశి రా.2.43 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం అశ్వని ఉ.6.41 వరకు భరణి, వర్జ్యం సా.5.04 నుండి 6.48 వరకు దుర్ముహూర్తం ప.11.32 నుండి 12.15 వరకు అమృతఘడియలు... రా.3.26 నుండి 4.45 వరకు.

సూర్యోదయం :    6.25
సూర్యాస్తమయం :  5.24
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

రాశి ఫలాలు:

మేషం... ఆస్తులు సమకూరతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృషభం... పనుల్లో అవాంతరాలు. రుణభారాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మిథునం... శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం.... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉధ్యోగాలలో కొత్త ఆశలు.

సింహం.... మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ తప్పదు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య.... కుటుంబ సమస్యలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాల్లో మార్పులు.

తుల.... పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికం... పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తులు కొంటారు. పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

ధనుస్సు.... పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో అవాంతరాలు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

మకరం.... రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. పనులు ముందుకు సాగవు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం.... కొత్త వ్యక్తుల పరిచయాలు. అందరిలో గౌరవం. భూలాభాలు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తుంది.

మీనం..... మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఏ వ్యవహారం చేపట్టినా ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
 

మరిన్ని వార్తలు