చార్‌ధామ్‌ హైవే ప్రాజెక్టుకు సుప్రీం అనుమతి

15 Dec, 2021 06:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని వ్యూహాత్మక చార్‌ధామ్‌ హైవే ప్రాజెక్టు డబుల్‌లేన్‌ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. జాతీయ భద్రతకు ఇటీవలి కాలంలో పలు సవాళ్లు ఎదురయ్యాయని, సరిహద్దుల్లోకి వేగంగా సైనిక బలగాలను తరలించడానికి ఈ రహదారి విస్తరణ అవసరమని వ్యాఖ్యానించింది. సాయుధ బలగాలకు అవసరమైన మౌలి క సదుపాయాల విషయంలో న్యాయస్థానం మరో సారి సమీక్ష చేపట్టలేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ ప్రాజెక్టుపై నేరుగా సుప్రీంకోర్టుకే నివేదిక అందజేసేందుకు మాజీ జడ్జి జస్టిస్‌ సిక్రి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటిం చింది. ప్రాజెక్ట్‌లో క్యారేజ్‌ వే వెడల్పు 5.5 మీట ర్లు ఉండేలా 2018 సర్క్యులర్‌ను అనుసరించా లంటూ 2020న సుప్రీం ఇచ్చిన ఆదేశాలను సవరించాలం టూ రోడ్డు రవాణా, రహదారుల శాఖ వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ తీర్థయాత్రాస్థలాలను కలుపుతూ ఏడాదంతా రాకపోకలు సాగిం చేందుకు వీలుగా కేంద్రం రూ.12వేల కోట్ల ఖర్చు తో 900 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. 

మరిన్ని వార్తలు