ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి.. బంధువుల నుంచి ధనలాభం

20 Dec, 2021 06:06 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయన ం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.పాడ్యమి ఉ.10.48 వరకు తదుపరి విదియ, నక్షత్రం ఆరుద్ర సా.6.39 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం ..లేదు, దుర్ముహూర్తం ప.12.19 నుండి 1.01 వరకు తదుపరి ప.2.30 నుండి 3.15 వరకు అమృత ఘడియలు..ఉ.7.34 నుండి 9.21 వరకు.

సూర్యోదయం :    6.28
సూర్యాస్తమయం    :  5.26
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆహ్వానాలు రాగలవు. బంధువుల నుంచి ధనలాభం. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం: శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: సన్నిహితులతో అకారణంగా విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

తుల: రుణభారాలు తప్పవు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. శ్రమానంతరం పనులు పూర్తి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం: సన్నిహితులతో వివాదాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. కష్టానికి ఫలితం కనిపించదు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మకరం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తు, వస్త్రలాభాలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కుంభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకం. విలువైన వస్తువులు జాగ్రత్త. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు రద్దు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని వివాదాలు.

మరిన్ని వార్తలు