ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సంఘంలో గౌరవం

22 Nov, 2021 06:12 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.తదియ రా.7.11 వరకు, తదుపరి చవితి నక్షత్రం మృగశిర ఉ.8.54 వరకు, తదుపరి ఆరుద్ర వర్జ్యం సా.6.06 నుండి 7.52 వరకు దుర్ముహూర్తం ప.12.09 నుండి 12.51 వరకు తదుపరి ప.2.21 నుండి 3.05 వరకు అమృతఘడియలు...రా.12.17 నుండి 2.03 వరకు.

సూర్యోదయం :    6.11
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 

వృషభం: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. శ్రమాధిక్యం.

మిథునం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార వృద్ధి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. మానసిక ఆందోళన.

సింహం: నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు. ప్రతిభ చాటుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. 

కన్య: కొత్త పనులు ప్రారంభిస్తారు.  భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి.

తుల: రుణాలు చేస్తారు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. పనులు ముందుకు సాగవు.

వృశ్చికం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. ఆలయాల సందర్శనం.

ధనుస్సు: ప్రయత్నాలు సఫలం. విందువినోదాలు. భూ, గృహయోగాలు. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం: కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వృత్తి, వ్యాపారాలలో మరింత పురోగతి.

కుంభం: కొత్త రుణాలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఆలయదర్శనాలు. 

మీనం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  

మరిన్ని వార్తలు