Weekly Horoscope: వారంలో ఈ రాశి వారు ఎటువంటి పని చేపట్టినా పట్టుదలతో పూర్తి చేస్తారు

12 Jun, 2022 06:56 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
నిరుద్యోగులు,  విద్యార్థుల కృషి ఫలించే సమయం. కొన్ని పనులు కొంత కష్టమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇతరులు సైతం మీ సాయం కోరతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సఫలం. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. అనుకున్న  సమయానికి సొమ్ము దక్కి అవసరాలు తీరతాయి.  వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగ విధుల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో  దుబారా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో  కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.  చిన్ననాటి మిత్రుల  నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఎట్టకేలకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో గందరగోళం తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల సందడి నెలకొంటుంది.  వ్యాపారాలలో మరింతగా లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది.. కళారంగం వారికి ప్రయత్నాలు సఫలం.  వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ఖర్చులు అధికమవుతాయి. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఎటువంటి పని చేపట్టినా పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. అందరిలోనూ పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వాహనసౌఖ్యం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు సమీకరిస్తారు. ఉద్యోగాలలో ఆందోళనకర పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు అనుకోని విధంగా ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో  ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, ఆకుపచ్చ. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఏ పనిలోనైనా విజయమే. ఆలోచనలు అమలు చేస్తారు. శ్రేయోభిలాషులు మీపై మరింత ఆదరణ చూపుతారు. భూములు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. ఆర్థికంగా ఇబ్బందుల నుండి బయటపడతారు. ఒక సమాచారం మీలో ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో నూతనోత్సాహం, లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వి«ధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల దీర్ఘకాలిక కోరిక నెరవేరుతుంది,  వారం ప్రారంభంలో అనుకోని  ఖర్చులు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆకుపచ్చ, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొన్ని పనులు నేర్పుగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.  నిరుద్యోగులకు  ఉద్యోగలాభం. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. భూములు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పట్టుదలతో ముందుకు సాగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు.  కళారంగం వారికి విశేష యోగకాలమనే చెప్పాలి. వారం మధ్యలో లేనిపోని వివాదాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. అనారోగ్య సూచనలు. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి..

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్య పనుల్లో అవాంతరాలు. కుటుంబ బాధ్యతలు మరింత పెరిగి సహనాన్ని పరీక్షిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వాహనాలు నడిపే వారు మరింత నిదానం పాటించాలి. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది.  రావలసిన సొమ్ము కొంత ఆలస్యమైన ఇబ్బందిపడతారు. మిత్రులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలలో కొంతమేరకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కత్తిమీద సాముగా ఉండవచ్చు. రాజకీయవర్గాలకు లేనిపోని చికాకులు తప్పకపోవచ్చు.  వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. 

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఊహలు నిజం చేసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు.  ఉద్యోగయత్నాలలో మరింత పురోగతి ఉంటుంది.  ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగాలలో ప్రత్యేక గుర్తింపు రాగలదు. కళారంగం వారికి సత్కారాలు జరిగే సూచనలు. వారం  చివరిలో మానసిక ఆందోళన. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. 

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. చిన్ననాటì  మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా గడిచిపోతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యతిరేక పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. అలాగే, విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో  ఆస్తి వివాదాలు. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అధిక ఆదాయం సమకూరుతుంది. అప్పులు కూడా తీరుస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. మీ ఆలోచనలు అమలులో కుటుంబసభ్యుల చేయూత ఉంటుంది. ఆస్తుల వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలలో లాభాల బాట పడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడుల నుంచి విముక్తి పొందుతారు. పారిశ్రామికవర్గాలకు దూరప్రాంతాల నుంచి  ఆహ్వానాలు  అందుతాయి. వారం చివరిలో మానసిక ఆందోళన. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి..

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
చాకచక్యంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అనుకున్న మేరకు సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి. రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు దక్కించుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తుల వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందే అవకాశం. ఉద్యోగాలలో మీరు కోరుకున్న హోదాలు రావచ్చు.  కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి.  వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నీలం, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆలోచనలను అమలులో పెట్టేందుకు యత్నిస్తారు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు దక్కే అవకాశం. పారిశ్రామికవర్గాలకు కొత్త అవకాశాలు, సంస్థల ఏర్పాటులో పురోగతి. వారం చివరిలో వృథా ఖర్చులు.  శ్రమ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యం. నలుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. 

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. ఆర్థిక వ్యవహారాలు మరింత పురోగతిలో ఉంటాయి. ప్రధాన సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణకు సమాయత్తమవుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. కొత్త కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు మరింత సమకూరతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు క్రమేపీ తగ్గుతాయి.  రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి.  వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. మానసిక అశాంతి. బంధువుల తాకిడి పెరుగుతుంది. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

మరిన్ని వార్తలు