UPI Transactions: యూపీఐ ట్రాన్సక్షన్స్.. ఆగస్టులో అన్ని లక్షల కోట్లా?

1 Sep, 2023 09:05 IST|Sakshi

ఆధునిక భారతదేశంలో జేబులో డబ్బుపెట్టుకునే వారి సంఖ్యకంటే కూడా యూపీఐ వినియోగించేవారి సంఖ్యే ఎక్కువగా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిల్లరకొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా దాదాపు అన్నీ యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. ప్రారంభం నుంచి అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ విధానం గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2023 ఆగస్టు 30 నాటికి యూపీఐ లావాదేవీలు 10.24 బిలియన్లు దాటినట్లు సమాచారం. దీని విలువ సుమారు 15.18 లక్షల కోట్లు అని తెలుస్తోంది. ఈ ట్రాన్సక్షన్స్ జులై నెలలో 9.88 బిలియన్స్. అంటే జులై నెల కంటే కూడా ఆగష్టు నెలలో లావాదేవీలు చాలా ఎక్కువ జరిగినట్లు స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?

నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం, జూలైలో 9.88 బిలియన్‌ డాలర్లు, ఆగష్టులో 10 బిలియన్లు అని తెలుస్తోంది. రానున్న రోజుల్లో రోజుకి ఒక బిలియన్ లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగ సీజన్ కావున తప్పకుండా యూపీఐ లావాదేవీలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు