సర్‌ప్రైజ్‌ న్యూస్‌.. మరో పాన్ ఇండియా సినిమాలో అనుష్క.. గ్లింప్స్‌ విడుదల | Anushka Shetty, Jayasurya's 'Kathanar' Glimpse Released - Sakshi
Sakshi News home page

Kathanar Glimpse: పాన్ ఇండియా సినిమాలో అనుష్క.. గ్లింప్స్‌ విడుదల

Published Fri, Sep 1 2023 9:01 AM

Anushka Shetty Kathanar Glimpse Released - Sakshi

అరుంధతితో తిరుగులేని విజయాన్ని అందుకున్న అనుష్క… జేజెమ్మగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ సినిమా ఆమె సినీ జీవితానికే ఓ మలుపుగా చెప్పుకోవచ్చు.. ఆ తర్వాత బాహుబలి ఫ్రాంచైజ్‌తో ఆమెకు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు దక్కింది. ఇలా టాలీవుడ్‌ నుంచి పాన్ ఇండియా వరకు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకుంది. కానీ సైజ్‌ జీరో సినిమా నుంచి చాలా గ్యాప్ తీసుకొని నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.

(ఇదీ చదవండి: 'జైలర్‌'కు భారీగా లాభాలు.. రజనీకి మరో చెక్‌ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?)

ఇదిలా ఉండగా అనుష్క శెట్టి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో జాయిన్ అయింది. మలయాళ చిత్ర సీమ నుంచి వస్తున్న ఫాంటసీ హారర్ డ్రామా 'కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్' సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను తాజాగ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో జాతీయ అవార్డు అందుకున్న మలయాళ టాప్‌ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా మేకర్స్‌ వెల్లడించారు.

(ఇదీ చదవండి: నేనూ ఒకమ్మాయిని ప్రేమించాను.. కానీ ఆమె మరో హీరోతో .. : విజయ్‌ సేతుపతి)

ఈ మూవీకి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమత్తత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.  మొత్తం 14 భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం. వచ్చే ఏడాది (2024)లో పార్ట్‌-1 విడుదల కానుందని వెల్లడించారు. సుమారు రెండు నిమిషాల పాటు ఉన్న ఈ గ్లింప్స్‌ వెన్నులో వణుకు పుట్టించేలా విజువల్స్‌ ఉన్నాయి. 

Advertisement
Advertisement