ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన  

1 Sep, 2023 18:04 IST|Sakshi

 7వ వేతన సంఘం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై భారీ  ఆశలు

3  శాతం పెంపు ఉంటుందని అంచనా

రక్షణ మంత్రిత్వ శాఖలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగుల ప్రమోషన్‌కు అవసరమైన కనీస అర్హత సర్వీస్ నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది. 7వ పే కమీషన్ పే మ్యాట్రిక్స్  అండ్‌  పే లెవెల్స్‌ను అనుసరించే  వేతనాలు చెల్లించే రక్షణ పౌర ఉద్యోగులకు ఈ సవరించిన నిబంధనలు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

 3 శాతం డీఏ పెంపుపై భారీ ఆశలు
డియర్‌నెస్ అలవెన్స్ పెంపునకు సమయం దగ్గర పడుతుండడంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం విశేషం. మరోవైపు ఈ సారి 3 శాతం  డీఏ పెంపుపై ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.  కేంద్రం తన కోటి మందికి పైగా ఉద్యోగులు ,పెన్షనర్లకు కరువు భత్యాన్ని (DA) 3 శాతం నుండి 45 శాతానికి పెంచవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. జూలైలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయిని దాటిన నేపథ్యంలో ఈ పెంపు ఉంటుందని అంచనా.  తాజా పెంపు డియర్‌నెస్ అలవెన్స్ జూలై 1, 2023 కి వర్తిస్తుంది. డీఏను చివరిసారిగా మార్చి 2023లో  4 శాతం పెంచి 42 శాతానికి చేర్చారు.  (వర్క్‌ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్‌ అంటున్న ఐటీ దిగ్గజం)

డీఏ పెంపు ఎలా ?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కోసం డియర్‌నెస్ అలవెన్స్ ప్రతి నెలా లేబర్ బ్యూరో ద్వారా విడుదల చేయబడిన పారిశ్రామిక కార్మికుల కోసం (CPI-IW) తాజా వినియోగదారుల ధరల సూచికలోని అంశాల ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రస్తుత జీతాలపై పెరుగుతున్న ధరల భారం ఆధారంగా కేంద్రం డియర్‌నెస్ అలవెన్స్‌ను మంజూరు చేస్తుంది. ( వర్క్‌ ఫ్రం హోం: ఐటీ ఉద్యోగులకు భారీ ఝలక్‌)

మరిన్ని వార్తలు