వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలి

1 Mar, 2023 01:26 IST|Sakshi

థర్డ్‌–పార్టీ ఆడిట్‌తో ఆందోళనలకు చెక్‌

రుణ భారంపై అనవసర ఆందోళనలు

అదానీ గ్రూప్‌పై రీసెర్చ్‌ సంస్థ ఎస్‌ఈఎస్‌

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌ సొంత వాటాదారులకే ప్రాధాన్యత ఇవ్వాలని కార్పొరేట్‌ పాలన పరిశోధన, సలహాదారు సంస్థ ఎస్‌ఈఎస్‌ ఒక నివేదికలో పేర్కొంది. గ్రూప్‌పై ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌ కంపెనీలలో వాటాదారుకాదని తెలియజేసింది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తదుపరి గ్రూప్‌ మార్కెట్‌ క్యాప్‌(విలువ) భారీగా పతనమైన నేపథ్యంలో ఖాతాలపై థర్డ్‌పార్టీ ఆడిట్‌ ద్వారా వాటాదారుల ఆందోళనలకు చెక్‌ పెట్టవచ్చని సలహా ఇచ్చింది.

గ్రూప్‌ రుణాలపై అవసరానికి మించి ఆందోళనలు తలెత్తినట్లు అభిప్రాయపడింది. స్వతంత్ర థర్డ్‌పార్టీ ఆడిట్‌ ద్వారా గ్రూప్‌ విశ్వాసాన్ని( క్రెడిబిలిటీ) తిరిగి పొందవచ్చని సూచించింది. యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీలలో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సుమారు 140 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ ఆవిరైంది. అయితే మంగళవారం(28న) ట్రేడింగ్‌లో పలు కౌంటర్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి.

క్యాష్‌ ఫ్లోలు ఓకే
అదానీ గ్రూప్‌లోని ప్రతీ కంపెనీ రుణ చెల్లింపులకు తగిన క్యాష్‌ ఫ్లోలు సాధించగలిగే స్థితిలో ఉన్నట్లు ఎస్‌ఈఎస్‌ అభిప్రాయపడింది. వెరసి గ్రూప్‌ రుణభారంపై అధిక స్థాయి ఆందోళనలు సరికాకపోవచ్చని పేర్కొంది. గ్రూప్‌లోని చాలా కంపెనీలు రుణ చెల్లింపులకు తగిన నగదు రాకను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ అధిక రుణ–ఈక్విటీ నిష్పత్తిని కలిగి ఉన్నట్లు పేర్కొంది. అయితే విద్యుత్‌ ప్రసారం బిజినెస్‌ ద్వారా ఫిక్స్‌డ్‌ రిటర్న్‌ సాధించగలమని కంపెనీ విశ్వసిస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఆందోళన లు సరికాదని పేర్కొంది. ఇక అదానీ గ్రీన్‌ అధిక రు ణ భారాన్ని కలిగి ఉన్నప్పటికీ రుణ చెల్లింపుల్లో ఎ లాంటి సమస్యలనూ ఎదుర్కోలేదని వివరించింది.

మరిన్ని వార్తలు