‘నాటునాటు’: అంత ఎనర్జీలేదు అయినా ఓకే.. ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ వైరల్‌

13 Jan, 2023 18:08 IST|Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర మరో ఇంట్రస్టింగ్‌ వీడియోను షేర్‌ చేశారు. టాలీవుడ్‌ అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో  వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. ఇక తాజాగా ఈ మూవీలోని పాట ‘నాటునాటు’ ప్రపంచ చలన చిత్ర రంగానికి చెందిన  ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. దీనిపైనే ఆనంద్‌ మహీంద్ర తాజాగా ట్విటర్‌ ద్వారా స్పందించారు. 

‘నాటు నాటు పాట తెలియని వారుండరు. ఈ వీడియోలోని ఈ రెండు పాత్రల్లో బ్రిటిష్-అమెరికన్ కామెడీ జంట లారెల్- హార్డీ డ్యాన్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌  హీరోల్లో కనిపించినంత ఎనర్జీ కనిపించకపోవచ్చు..కానీ పర్లేదు. ఎంజాయ్ చేయండి’ అంటూ ఆనంద్‌ మహీంద్ర పేర్కొనడంతో నాటునాటు మేనియా ఒక రేంజ్‌లో సాగుతోంది. పర్‌ఫెక్ట్‌ ఫ్రైడే అంటూ తెగ సంబరపడి పోతున్నారు. 

కామెడీ కింగ్స్‌ బ్రిటిష్-అమెరికన్ కామెడీ జంట లారెల్-హార్డీ స్టెప్పులేస్తున్న ఒక  వీడియోను ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేశారు. ‘నాటునాటు’ పాటకు వారు డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో..  అచ్చంగా ఆ పాటకు తగినట్టుగా  ఉన్న ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సూపర్‌గా సెట్‌ అయిందంటూ  ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు.

ముఖ్యంగా భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్లా కూడా దీనిపై స్పందించారు. సంగీతం,  నృత్యం,  సినిమాలకు సంస్కృతి, భాష, జాతీయ, అంతర్జాతీయ అపుడు ఇపుడూ సరిహద్దులు లేవు. మూకీ సినిమాల కాలం నుండి ఇది ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడింది!! అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. కాగా నాటునాటు పాటకు ఇన్సిపిరేషన్‌గా ఉన్న  ఈ వీడియో  గత ఏడాది సోషల్‌ మీడియాలో హల్‌  చల్‌ చేసిన సంగతి  తెలిసిందే. 

మరిన్ని వార్తలు