విడిగా వివిధ బిజినెస్‌ల లిస్టింగ్‌: అనిల్‌ అగర్వాల్‌ మెగా ప్లాన్‌

26 Aug, 2023 04:58 IST|Sakshi

జాబితాలో ఆయిల్, ఐరన్, మైనింగ్‌

వేదాంతా గ్రూప్‌ తాజా ప్రణాళికలు

న్యూఢిల్లీ: మైనింగ్, మెటల్‌ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ గ్రూప్‌లోని బిజినెస్‌లను విడిగా లిస్ట్‌ చేయాలని భావిస్తోంది. వాటాదారులకు మరింత విలువ చేకూర్చేబాటలో అల్యూమినియం, ఇనుము–ఉక్కు, చమురు–గ్యాస్‌ తదితర విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే యోచనలో ఉన్నట్లు వేదాంతా గ్రూప్‌ చీఫ్‌ అనిల్‌ అగర్వాల్‌ తాజాగా పేర్కొన్నారు. మాతృ సంస్థ వేదాంతా రీసోర్సెస్‌ వీటన్నిటికీ హోల్డింగ్‌ కంపెనీగా కొనసాగనుంది. (మార్కెట్‌లో దూసుకుపోతున్న భారత్‌: ఈ నంబర్‌ ప్లేట్ల గురించి  తెలుసా?)


వాటాదారులకు వీడియో సందేశం ద్వారా చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ఈ వివరాలు వెల్లడించారు. మెటల్స్‌ అండ్‌ మైనింగ్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ తదితరాలను విడిగా లిస్ట్‌ చేయడం ద్వారా భారీగా వృద్ధి చెందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. వెరసి వేదాంతా లిమిటెడ్‌లో 1 షేరుని కలిగి ఉంటే పలు కంపెనీలలో షేర్లను పొందేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేశారు. (పండగ సీజన్‌..బీఅలర్ట్‌: సెప్టెంబరులో బ్యాంకు సెలవులెన్నో తెలుసా?)

తొలుత 2021 నవంబర్‌లో అగర్వాల్‌ బిజినెస్‌ల విడదీత, వ్యూహాత్మక భాగస్వామ్యాలు తదితరాల ద్వారా కార్పొరేట్‌ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కార్పొరేట్‌ నిర్మాణాన్ని క్రమబదీ్ధకరించడం, సరళీకరించడం ద్వారా వాటాదారులకు లబ్ది చేకూర్చాలని భావించారు. దీర్ఘకాలిక వృద్ధికి తెరతీయాలని ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. అయితే ప్రస్తుతం ఇందుకున్న అవకాశాలపై వాటాదారులు, తదితరుల అభిప్రాయాలకు ఆహా్వనం పలుకుతున్నారు.  

రెండు దశాబ్దాలుగా..
గత రెండు దశాబ్దాలలో వేదాంతా దిగుమతుల ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లు అగర్వాల్‌ పేర్కొన్నారు. దీంతో ఆయా విభాగాలలో ప్రవేశించడం అత్యంత క్లిష్టతరమని అభిప్రాయపడ్డారు. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌తోపాటు భారీ స్థాయిలో అల్యూమినియంను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రస్తావించారు. ఈ బాటలో సమీకృత విద్యుత్, కాపర్, జింక్, సిల్వర్, లెడ్, ఐరన్‌ అండ్‌ స్టీల్, నికెల్, ఫెర్రోఅల్లాయ్స్, సెమీకండక్టర్, డిస్‌ప్లే గ్లాస్‌ తదితర మరిన్ని విభాగాలలో కార్యకలాపాలు విస్తరించినట్లు వివరించారు.

ప్రస్తుతం ఇవన్నీ వేదాంతా గొడుగుకిందనే ఉన్నట్లు తెలియజేశారు. మొత్తం ప్రపంచమంతా ఇండియాలో ఇన్వెస్ట్‌ చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు స్వతంత్ర కంపెనీలపట్లనే ఆసక్తి చూపుతారని, ప్రత్యేక కంపెనీగా విడిపోవడం ద్వారా కీలక బిజినెస్‌పై దృష్టి సారించగలుగుతాయని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇన్వెస్టర్లకు తమకిష్టమైన రంగాలు, కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుంటుందని వివరించారు. తద్వారా ఉత్తమ రిటర్నులతోపాటు డివిడెండ్లు అందుతాయని అంచనా వేశారు.
 

మరిన్ని వార్తలు