10కోట్లకు పైగా అమ్ముడైన ఆపిల్‌ వాచ్‌లు

14 Feb, 2021 19:56 IST|Sakshi

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల వినియోగదారులు ఆపిల్‌ వాచ్‌ను ధరిస్తున్నారని ఆపిల్‌ ఉత్పత్తుల విశ్లేషకుడు నీల్‌ సైబర్ట్‌ తెలిపారు. నీల్‌ సైబర్ట్ తెలిపిన వివరాల ప్రకారం ఆపిల్ వాచ్ 10 కోట్ల  మైలురాయిని చేరుకోవడానికి 6 సంవత్సరాల కన్నా తక్కువ సమయం పట్టింది. 2020లోనే 30 మిలియన్ల మంది కొత్త వినియోగదారులు ఆపిల్ వాచ్‌ను కొన్నట్లు నీల్‌ సైబర్ట్ పేర్కొన్నారు. అయితే ఈ వినియోగదారుల సంఖ్య 2015, 2016, 2017 సంవత్సరాల్లో ఆపిల్ వాచ్ కొన్న వినియోగదారుల కంటే ఎక్కువ.

పది కోట్ల మంది కొనుగోలుదారులతో ఆపిల్‌ వాచ్‌ ఆపిల్‌ ఐఫోన్‌, ఐపాడ్‌, మాక్‌ తర్వాత నాలుగో అతిపెద్ద ఆపిల్‌ ప్రోడక్ట్‌గా నిలిచిందని సైబర్ట్ చెప్పారు. ప్రస్తుత అమ్మకాలు చూస్తే 2022లో ఆపిల్ వాచ్ మాక్ ఉత్పత్తులను అధిగమించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఐప్యాడ్‌ను అధిగమించడానికి ఎక్కువ సమయం పట్టనున్నట్లు నీల్‌ సైబర్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. 2020 చివరిలో యుఎస్‌లో సుమారు 35శాతం ఐఫోన్ వినియోగదారులు ఆపిల్ వాచ్ ధరించారు. యాక్టివిటీని పర్యవేక్షించడం, కీలక ఆరోగ్య డేటా మానిటర్‌ వంటి వినూత్న ఫీచర్లతో ఆపిల్ వాచ్‌ యూజర్లను ఆకట్టుకొన్నట్టు అనలిస్ట్‌ నీల్‌ సైబర్ట్ తెలిపారు. ఆపిల్ వాచ్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో 55 శాతం వాటా కలిగి ఉంటే, శామ్సంగ్ 13.9 శాతం వాటాను కలిగి ఉంది. గ్లోబల్ మార్కెట్లో 8 శాతం వాటాతో గార్మిన్ రబుల్‌ మార్కెట్‌లో మూడవ స్ధానంలో నిలిచింది.

చదవండి:
కర్ణాటకలో టెస్లా ప్లాంట్

సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరలు!

మరిన్ని వార్తలు