గ్రిడ్ 2.0 ఈవీ స్టేషన్స్ లాంచ్ చేసిన అథర్ ఎనర్జీ

31 Oct, 2021 14:53 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ అథర్ ఎనర్జీ నేడు(అక్టోబర్ 31) తర్వాతి తరం ఎలక్ట్రిక్ వేహికల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ లాంచ్ చేసినట్లు ప్రకటించింది. దీనిని అథర్ గ్రిడ్ 2.0 పేరుతో పిలుస్తున్నారు. ఈ కొత్త తరం ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నెట్ వర్క్ ఓవర్ ది ఎయిర్(ఓటిఏ) వంటి ఆధునాతన ఫీచర్లతో పనిచేయనుంది. అథర్‌ ఎన‌ర్జీ ఇప్పటికే బెంగళూరు, చెన్నైలో ఈ కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్‌ను ఇన్ స్టాల్ చేయడం ప్రారంభించింది. త్వరలో దేశంలోని ఇతర నగరాల్లో కూడా వీటిని లాంచ్ చేయనుంది.

కంపెనీ ప్రస్తుత ఛార్జింగ్ గ్రిడ్లతో పోలిస్తే కొత్త జెనెరేషన్ పబ్లిక్ ఛార్జింగ్ నెట్ వర్క్ వేగంగా చార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అథర్ గ్రిడ్ 2.0ను అన్నీ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే విధంగా నిర్మించినట్లు సంస్థ తెలిపింది. ఈ గ్రిడ్ 2.0 అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. తద్వారా అన్ని నగరాల్లో అన్ని ఛార్జింగ్ లొకేషన్ల రియల్ టైమ్ వివరాలు అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ ఎలక్ట్రిక్ వేహికల్ పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం అతిపెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసింది. అథర్ గ్రిడ్ ఛార్జింగ్ నెట్ వర్క్ ప్రస్తుతం 215కి పైగా ప్రదేశాలలో, 21 నగరాల్లో విస్తరించి ఉంది. కంపెనీ 2022 చివరి నాటికి మరో 500 నగరాల్లో ఛార్జింగ్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

(చదవండి: వారం రోజుల్లో సుమారు రెండున్నర లక్షల కోట్లు ఖతమ్‌..!)

మరిన్ని వార్తలు