ఉద్యోగులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే శుభవార్త!

14 Sep, 2021 16:06 IST|Sakshi

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) అదిరిపోయే శుభవార్త తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల కోసం "శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్" పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఉద్యోగులు ఉచితంగా కోటి రూపాయల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఈ సమాచారాన్ని షేర్ చేసింది. 

శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ) తన వెబ్ సైట్లో పేర్కొన్న సమాచారం ప్రకారం.. బీఓఐ శాలరీ ప్లస్ అకౌంట్ స్కీం కింద మూడు రకాల వేతన ఖాతాలు ఉన్నాయి. ఉద్యోగులు కేవలం కేవలం శాలరీ అకౌంట్ కింద మాత్రమే ఖాతా తెరిచే అవకాశం ఉంది.(చదవండి: పెట్రోల్-డీజిల్ జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా?)

  • పారా మిలటరీ ఫోర్స్ ఉద్యోగులకు శాలరీ అకౌంట్
  • కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్వవిద్యాలయం, కళాశాల, ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు శాలరీ అకౌంట్
  • ప్రైవేట్ రంగ ఉద్యోగులకు శాలరీ అకౌంట్

రూ.కోటి వరకు ఉచిత యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్
బీఓఐ శాలరీ ప్లస్ అకౌంట్ స్కీం కస్టమర్లకు ఎంతో సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద, బ్యాంకు వేతన ఖాతాదారులకు రూ.30 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. బ్యాంకు షేర్ చేసిన ట్వీట్ ప్రకారం వేతన ఖాతాదారుడికి రూ.కోటి ఉచిత ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కూడా అందిస్తుంది.

  • వేతన ఖాతాదారులకు రూ. 2 లక్షల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం.
  • ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేనప్పటికీ రూ.2 లక్షల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
  • ఉచితంగా గోల్డ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు(గోల్డ్ ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు) ఇస్తోంది.
  • ఏడాదికి 100 చెక్స్ లీవ్స్ గల బుక్ ఉచితంగానే అందిస్తారు.  
  • డీమ్యాట్ ఖాతాల(డీమ్యాట్ అకౌంట్స్)పై ఎఎంసి ఛార్జ్ విధించరు.
  • లోన్ల విషయంలో ఖాతాదారులకు 0.25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుంది.

ప్రయివేట్ సెక్టార్ శాలరీ అకౌంట్
ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్లస్ అకౌంట్ స్కీమ్ కింద ఖాతా ఓపెన్ చేయవచ్చు. నెలకు రూ.10,000 సంపాదించే వారు ఈ పథకం కింద వేతన ఖాతాలను తెరవవచ్చు. దీనికి మిమినాన్ బ్యాలెన్స్ అవసరం లేదు. వేతన ఖాతాదారుడు రూ.5 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. అలాగే ఉచితంగా గ్లోబల్ డెబిట్ కార్డు పొందుతారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు