Bitcoin: సరికొత్త రికార్డును నమోదుచేసిన బిట్‌కాయిన్‌..!

6 Oct, 2021 20:49 IST|Sakshi

Bitcoin Rises: క్రిప్టోకరెన్సీపై  చైనా నిషేధం విధించడంతో ఒక్కసారిగా బిట్‌కాయిన్‌ లాంటి క్రిప్టోకరెన్సీలు భారీగా పతనమయ్యాయి. దీంతో గత కొన్నిరోజులుగా పలు ఇన్వెస్టర్లు   స్టాక్స్‌, గోల్డ్‌ వంటి వాటిపై చేయడం మొదలు పెట్టారు. బిట్‌కాయిన్‌ లాంటి క్రిప్టోకరెన్సీపై మోహం చాటేశారు. అంతర్జాతీయంగా ఎల్‌ సాల్వాడార్‌ వంటి దేశాల నిర్ణయం, ఎలన్‌ మస్క్‌ అభిప్రాయాలు పలు  క్రిప్టోకరెన్సీ పెరుగుదలకు అండగా నిలిచాయి.
చదవండి: అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్‌ రిపీట్‌..! 

పుంజుకున్న బిట్‌కాయిన్‌..!
చైనా నిర్ణయం, అధిక ద్రవ్యోల్భణం వంటివి కాస్త ఒడిదుడుకులను సృష్టించినా...పలు క్రిప్టోకరెన్సీలు తిరిగి మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా బిట్‌కాయిన్‌ సరికొత్త రికార్డులను నమోదుచేసింది. గత ఏడు రోజుల్లో బిట్‌కాయిన్‌ 30 శాతం కంటే ఎక్కువ పురోగతిని సాధించింది. అక్టోబర్‌ 6 న బిట్‌కాయిన్‌ విలువ  సుమారు  54,079 డాలర్లకు చేరింది. బిట్‌కాయిన్‌ విలువ ఐదున్నెల్ల  గరిష్టానికి చేరుకుంది.

క్రిప్టోకరెన్సీ ట్రాకర్ కాయిన్‌జెక్కో ప్రకారం.. ఇతర డిజిటల్ నాణేలు కూడా భారీగా  పెరిగాయి.  ఈథర్, బినాన్స్ కాయిన్, సోలానా , డోగ్‌కోయిన్ విలువ గత ఏడు రోజుల్లో భారీగా పెరిగింది.  క్రిప్టో ఎక్స్ఛేంజ్ క్రాకెన్ ప్రకారం, అక్టోబర్ ప్రారంభం నుంచి బిట్‌కాయిన్ ట్రేడింగ్ వాల్యూమ్‌లు ఈథర్ కంటే మూడింట రెండు వంతుల పెద్దవిగా ఉన్నాయి. 
చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్‌...!

మరిన్ని వార్తలు