ఇంద్ర భవనం! బ్రిట్నీ స్పియర్స్‌ భారీ నష్టానికి అమ్మేసిన ఇల్లు ఇదే..

17 Jun, 2023 19:10 IST|Sakshi

పాప్‌ స్టార్‌ బ్రిట్నీ స్పియర్స్‌ లాస్‌ ఏంజిల్స్‌లోని విలాసవంతమైన బంగళాను ఏడాది కూడా కాకుండానే భారీ నష్టానికి అమ్మేసింది. ఈ ఇంటిని చూస్తే ఇంద్ర భవనం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది.

 

లాస్‌ ఏంజిల్స్‌ నగరంలోని కాలాబాసాస్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న బ్రిట్నీ స్పియర్స్‌ నివాసం కొన్ని నెలల క్రితం 10.1 మిలియన్‌ డాలర్లకు చేతులు మారింది. ఏడాది క్రితం ఆమె దాన్ని 11.8 మిలియన్ డాలర్లకు కొనుక్కున్నారు. 

2022 జూన్‌లో ఈ ఇంటిని కొనుగోలు చేసింది బ్రిట్నీ స్పియర్స్‌ భర్త సామ్ అస్గారితో కలిసి కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండేది. అయితే ఇది అందరికీ తెలిసిపోయి తమ ఏకాంతానికి అనుకూలంగా లేకపోవడంతో వారు దీన్ని వదిలి వేరే ఇంటికి మారిపోయారు.

 

2008లో నిర్మించిన ఈ భవనంలో ఆరు బెడ్‌రూమ్‌లు, తొమ్మిది స్నానపు గదులు 11,600 చదరపు అడుగుల సింగిల్-లెవల్ లివింగ్ స్పేస్‌లో విస్తరించి ఉన్నాయి. 

వంపు హాలులు, కాఫర్డ్ సీలింగ్‌లు, చెక్కతో చేసిన యాక్సెంట్‌లు ఇంటి అంతటా ఉన్నాయి. విలాసవంతమైన గౌర్మెట్ కిచెన్, లెదర్ రిక్లైనింగ్ సీట్లు కలిగిన హోమ్ థియేటర్, వాక్-ఇన్ సేఫ్, గేమ్ రూమ్, పెట్ వాష్ బేసిన్ వంటివి చూస్తే కళ్లు చెదరకతప్పదు.

వీటితోపాటు వాటర్‌ ఫౌంటైన్లు, మొజాయిక్ టైల్డ్ పూల్, హాట్ టబ్, వాటర్‌ ఫాల్స్‌, బార్బెక్యూ పెవిలియన్, గెస్ట్ హౌస్ వంటివి కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు