బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త  ప్రీపెయిడ్  ప్లాన్‌..

3 Apr, 2021 12:32 IST|Sakshi

సాక్షి, ముంబై:  ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌(బీఎస్ఎన్ఎల్‌) తన యూజర్ల కోసం కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.108తో రీచార్జ్ చేసుకున్నవారికి 60 రోజలు పాటు ప్రతి రోజు 1జీబీ డేటాను ఇవ్వనున్నది.  ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా యూజర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్‌ ప్లాన్‌ను తీసు కొచ్చింది.  ప్రస్తుతం రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్  కేవలం 28 రోజులకు లేదా 56 రోజుల కాలపరిమితితో 1జీబీ డేటాను  అందిస్తున్న సంగతి తెలిసిందే.  వీటితో పోలిస్తే తక్కువ రేటుకే ఈ ప్లాన్‌ను  ఆఫర్‌ చేస్తోంది. 

బీఎస్ఎన్ఎల్ తన రూ.108 ల తాజా ప్లాన్‌లో 1జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్,  ఉచితంగా 500 ఎస్ఎంఎస్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.  నిర్దేశిత రోజువారి డేటా పూర్తి అయితే, అప్పుడు ఇంటర్నెట్ డౌన్‌లోడింగ్‌, అప్‌లోడింగ్ స్పీడ్‌ను 80కేబీపీఎస్‌కు పరిమితం కానుంది.  అయితే ఈ కొత్త ప్యాక్ ఢిల్లీ, ముంబై ఎంటీఎన్ఎల్ నెట్‌ వర్క్‌లో లభ్యం. అలాగే  రూ.47కే ఫస్ట్ రీచార్జ్‌, రూ.109 ప్లాన్ వోచర్‌, రూ.998, రూ.1098 లాంటి స్పెషల్ టారిఫ్ వోచర్స్ ను బీఎస్ఎన్ఎల్ రద్దు చేసింది.

మరిన్ని వార్తలు