Car Safe Device: డ్రైవింగ్‌ సీట్లో నిద్ర..రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తం చేసే డివైజ్‌

5 Sep, 2021 08:45 IST|Sakshi

ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రయాణాల్లో ఏ ప్రమాదం ఎటునుంచి మీదకొస్తుందో తెలియని రోజులివి. ఇక దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడైతే.. డ్రైవింగ్‌ సీట్లో ఉన్న వాళ్లకు మరిన్ని జాగ్రత్తలు తప్పవు. స్మూత్‌గా దూసుకుపోయే కారు వంటి వాహనాల్లో నిద్ర ముంచుకొస్తుంటుంది. అప్పుడే రెప్పపాటు కాలంలో ఘోర ప్రమాదాలు జరిగిపోతుంటాయి. 

అలాంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి.. హెచ్చరించే పరికరమే చిత్రంలోని ఆటో సేఫ్‌ డివైజ్‌. విధుల్లో ఉన్నప్పుడు పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన వ్యక్తుల కోసం ఈ రిమైండర్‌ని రూపొందించారు. డ్రైవర్స్, రాత్రిపూట డ్యూటీ చెసే సెక్యూరిటీ గార్డ్స్, మెషిన్‌ ఆపరేటర్లు ఇలా ఎందరికో ఈ డివైజ్‌ ఉపయోగపడుతుంది. పోర్టబుల్‌ సైజుతో డిజైన్‌ చేసిన ఈ పరికరం.. ప్రాణాలను రక్షించే నిద్ర నిరోధక అలారమే అంటున్నారు నిపుణులు. 

ఎలక్ట్రానిక్‌ పొజిషన్‌ సెన్సార్‌ కలిగిన ఈ గాడ్జెట్‌ని.. చెవికి బ్లూటూత్‌ మాదిరి పెట్టుకుంటే సరిపోతుంది. వినియోగిస్తున్నవారు ఏమాత్రం నిద్ర మత్తులో తూగినా చెవిలో వైబ్రేషన్‌తో కూడిన అలారాన్ని మోగించి అలెర్ట్‌ చేస్తుంది.

మరిన్ని వార్తలు