చిరంజీవిలా చాలామంది యూత్‌ వర్కవుట్స్‌ చేయలేరు

5 Sep, 2021 08:45 IST|Sakshi

‘‘ప్రేక్షకులకు, అభిమానులకు వాళ్లు బిగ్‌ స్టార్స్‌. నేను థియేటర్లో సినిమా చూసినప్పుడూ నాకు వాళ్లు బిగ్‌ స్టార్సే. కానీ నా జిమ్‌కి వస్తే స్టూడెంట్స్‌’’ అంటున్నారు కుల్‌దీప్‌ సేథీ. చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్, విజయ్‌ దేవరకొండ, కార్తికేయ, రష్మికా మందన్నా, రాశీ ఖన్నా... ఇలా పలువురు స్టార్స్‌కు ఫిట్‌నెస్‌ గురు ఆయన. స్టార్‌ స్టూడెంట్స్‌తో తన టీచింగ్‌ అనుభవాలను కుల్‌దీప్‌ ఇలా పంచుకున్నారు.

♦ 2004లో రామ్‌చరణ్‌ పరిచయమయ్యారు. అప్పుడు ఆయనకు ట్రైనింగ్‌ మొదలుపెట్టాను. ‘చిరుత’ సమయంలో బ్యాంకాక్‌కు వెళ్లి ట్రైన్‌ చేశాను. ‘మగధీర’ అప్పుడు రాజమౌళి సార్‌ ఓ స్కెచ్‌ ఇచ్చారు. పాత్ర ప్రకారం షోల్డర్స్‌ ఉండాలి, చెస్ట్‌ ఎక్కువ ఉండకూడదు వంటి జాగ్రత్తలతో చరణ్‌ ఫిజిక్‌ని తీర్చిదిద్దాను. అలా చరణ్‌కి నేను నచ్చడంతో మెగాస్టార్‌ చిరంజీవిని కూడా ట్రైన్‌ చేసే లక్‌ దక్కింది. 

♦ చిరంజీవి డూప్స్‌ లేకుండా యాక్షన్‌ సీన్స్‌ చేస్తుంటారు. అందువల్ల ఫిజికల్‌గా తరచూ ఇబ్బందులు పడుతుంటారు. అయితే  కెమెరా ముందైనా, జిమ్‌లోనైనా ఆ కష్టం ఆయనలో కనిపించేది కాదు. ఇప్పటికీ చాలామంది యూత్‌ ఆయనలా వర్కవుట్స్‌ చేయలేరు. 

♦ స్టార్స్‌ అందరూ నాకిష్టమే. అయితే విజయ్‌ దేవరకొండతో మరింత కనెక్ట్‌ అయ్యాను. విజయ్‌కి ‘లైగర్‌’కి ట్రైన్‌ చేస్తున్నాను. విజయ్‌ ఎన్ని వర్కవుట్స్‌ ఇచ్చినా నిశ్శబ్దంగా చేసేస్తాడు. అయితే అతను పూర్‌ ఈటర్‌. తినమని నేనే ఫోర్స్‌ చేస్తుంటా. ఎంత పెద్ద స్టార్‌ అయినా మన నుంచి స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ కోరుకోడు.
 

♦ కార్తికేయ ఫిజిక్‌ ది బెస్ట్‌. అతన్ని నేను ట్రైన్‌ చేస్తున్నాను కానీ.. తనను చూసి నేను ఇన్‌స్పైర్‌ అవుతుంటాను.

♦ చాలా త్వరగా తాను చేసే వర్కవుట్స్‌ బోర్‌ కొట్టేస్తాయి రాఖీ ఖన్నాకి. ఎప్పటికప్పడు మారుస్తూ ఉండాలి. ఇక రష్మిక అయితే చాలు.. చాలు... అంటున్నా ఇంకా వర్కవుట్స్‌ చేస్తానంటుంది. బలవంతంగా గెట్‌ అవుట్‌ అంటూ జిమ్‌ నుంచి పంపేస్తా (నవ్వుతూ).

చదవండి : హీరోయిన్‌ త్రిషను అరెస్ట్‌ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు
చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన హీరో సుదీప్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు