తగ్గేదేలే అంటున్న కార్ల అమ్మకాలు.. తొలి నెలలోనే అదరగొట్టారు

2 Feb, 2023 08:46 IST|Sakshi

ముంబై: కొత్త క్యాలండర్‌ ఏడాది(2023) తొలి నెలలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దిగ్గజాలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, టీకేఎం, కియా ఇండియా, హ్యుందాయ్‌ జనవరిలో పటిష్ట విక్రయాలను సాధించాయి. అయితే ఎంజీ మోటార్, హోండా మాత్రం వాహన విక్రయాలలో వెనకడుగు వేశాయి. మారుతీ 12 శాతం అధికంగా 1,72,535 వాహనాలను విక్రయించగా.. ఎంఅండ్‌ఎం 37 శాతం వృద్ధితో 64,335 వాహనాలను అమ్మింది.

ఈ బాటలో టాటా మోటార్స్‌ అమ్మకాలు సైతం 6 శాతం పుంజుకుని 81,069 వాహనాలకు చేరాయి. టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌(టీకేఎం) అమ్మకాలు 175 శాతం జంప్‌చేసి 12,835 యూనిట్లను తాకాయి. కియా ఇండియా అమ్మకాలు 48 శాతం మెరుగుపడి 28,634 యూనిట్లకు చేరగా.. హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా 17 శాతం అధికంగా 62,276 వాహనాలను విక్రయించింది. 

చదవండి: Union Budget 2023-24: పెరిగేవి, తగ్గేవి ఇవే!

మరిన్ని వార్తలు