ఆహార ధాన్యాల ఎగుమతులు.. భారత్‌ ఆందోళన

13 Jun, 2022 09:26 IST|Sakshi

డబ్ల్యూఎఫ్‌పీకి పూర్తి మినహాయింపులపై భారత్‌ ఆందోళన 

ఎస్‌ఎస్‌ఎం కోసం మరోసారి డిమాండ్‌ 

 మొదలైన 12 డబ్ల్యూటీవో మంత్రిత్వ సదస్సు  

జెనీవా: ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార పథకం కోసం కొనుగోలు చేసే ఆహార ధాన్యాలకు ఎగుమతుల నుంచి పూర్తి మినహాయింపులను కొనసాగించడానికి సుముఖంగా లేమని భారత్‌ తెలిపింది. ఇది దేశీయంగా ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో పాలకులను నియంత్రిస్తుందని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆదివారం జెనీవాలో మొదలైన ప్రపంచ వాణిజ్య సంస్థ 12వ మంత్రిత్వ సదస్సులో ఇది చర్చకు వచ్చింది. డబ్ల్యూటీవో కింద 164 సభ్య దేశాల తరఫున నిర్ణయాలు తీసుకునే అత్యున్నత మండలి ఇది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆధ్వర్యంలోని బృందం ఇందులో పాల్గొంటోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల జీ–33 గ్రూపు ఉమ్మడిగా కలసి పనిచేయాలని, భాగస్వామ్య దేశాల మద్దతుతో తటస్థమైన, పారదర్శక ఫలితం వచ్చేలా డబ్ల్యూటీవోలో కృషి చేయాలని భారత్‌ పిలుపునిచ్చింది. 

డబ్ల్యూటీవో సమావేశం సందర్భంగా జీ33 దేశాల మంత్రులను ఉద్దేశించి గోయల్‌ మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాలు భారీ సబ్సిడీలతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతులను కుమ్మరించడం వల్ల స్థానికంగా ధరలు పడిపోయి, అస్థిరతలను ఎదుర్కోవాల్సి వస్తోందని వాణిజ్య గోయల్‌ మరోసారి ప్రస్తావించారు. దీన్నుంచి రక్షణ కల్పించే ‘ప్రత్యేక రక్షణ యంత్రాంగం (ఎస్‌ఎస్‌ఎం) కోసం భారత్‌ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది.   

చదవండి: వెబ్‌ 3నే అంతు చిక్కలేదు అప్పుడే వెబ్‌ 5 అంటున్నారు!
 

మరిన్ని వార్తలు