మండుతున్న ఇంధన ధరలు...ఉద్యోగులకు బంపర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన కంపెనీ..!

3 Apr, 2022 22:15 IST|Sakshi

ఏ క్షణాన  రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ మొదలైందో ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇరు దేశాల యుద్దం నేపథ్యంలో క్రూడాయిల్‌ ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. భారత్‌తో సహా పలు ప్రపంచ దేశాల్లో ఇంధన ధరలు  రాకెట్‌లాగా దూసుకుపోతున్నాయి. ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కన్పిస్తున్నాయి. కాగా చెన్నైకు చెందిన ఓ సంస్థ ఇంధన ధరలకు విరుగుడుగా తన ఉద్యోగులను ఆశ్యర్యపరుస్తూ అద్బుతమైన గిఫ్ట్‌ను అందించింది.

సైకిల్‌పై సవారి..!
కొఠారి పెట్రోకెమికల్స్‌కు చెందిన మనాలి ప్లాంట్స్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులకు సైకిళ్లను గిఫ్ట్‌గా ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. వారంలో ఒకసారైనా సైకిల్‌ మీద ఉద్యోగులు ఆఫీసులకు రావాలని పేర్కొంది. దీంతో పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ఉపశమనం కలుగుతూనే...వారి ఆరోగ్యం కూడా మెరుగవుతుందని కొఠారి పెట్రోకెమికల్స్‌ యాజమాన్యం పేర్కొంది. ఈ కంపెనీలో అటెండర్‌ నుంచి ఉన్నత ఉద్యోగులతో సహా సైకిల్‌పై రావాల్సిందంటూ కంపెనీ వెల్లడించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉద్యోగులు సైకిల్‌పై ఆఫీసులకు వచ్చేందుకు సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. 

చదవండి: వాట్సాప్‌ సంచలన నిర్ణయం..!

మరిన్ని వార్తలు