Cafe Coffee Day: 'కెఫె కాఫీ డే' కు మరో ఎదురు దెబ్బ

8 Oct, 2022 07:29 IST|Sakshi

బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ప్రయివేట్‌ రంగ కంపెనీలు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ విఫలమైంది.సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికం(క్యూ2)లో దాదాపు రూ. 466 కోట్లమేర అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కేఫె కాఫీ డే సంస్థ తెలిపింది. వీటిలో ఎన్‌సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్‌ తదితర అన్‌లిస్టెడ్‌ రుణ సెక్యూరిటీలున్నట్లు పేర్కొంది. 

అయితే  భర్త వీజీ సిద్ధార్థ మరణంతో కొండలా పేరుకు పోయినా అప్పును మాళవిక హెగ్డే మంచులా కరిగించేశారు.కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్‌ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో కెఫె కాఫీ డే ఆర్ధిక వ్యవహారాలు బిజినెస్‌ వరల్డ్‌లో హాట్‌ టాపిగ్గా మారాయి. ఎందుకంటే?

మాళవిక హెగ్డే
మాళవిక హెగ్డే అనే పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కూతురిగా మాత్రమే మాళవిక హెగ్డే సుపరిచితం. ఇది అంత గతం. ఇప్పుడు తన గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇక నుంచి ఆమెను ఎప్పటికీ మరిచిపోరు. ఇంకా చెప్పాలంటే..

భర్త మరణంతో వెలుగులోకి 
2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు.

కొండంత అప్పును మంచులా కరిగించేసింది
కేఫె కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు.

కెఫె కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్‌ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. 

చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్‌ అంబానీ వీలునామా!

>
మరిన్ని వార్తలు