కొంచెం లాభం.. చివరికి నష్టం ఉక్కిరిబిక్కిరైన ఇన్వెస్టర్లు

4 Feb, 2022 16:08 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లతో లాభనష్టాలు దోబూచులాడాయి. కొద్ది సేపు లాభాలు అంతలోనే నష్టాలు మళ్లీ లాభాలు.. ఇలా రోజంతా దేశీ సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. క్షణక్షణానికి మారుతున్న పరిస్థితులు అస్థిరతల మధ్య ఇన్వెస్టర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చివరకు గంటలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 143 పాయింట్లు నష్టపోయి 58,644 వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 17,516 పాయింట్ల దగ్గర ముగిసింది.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెనెక్స్‌ 58,918 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ వెంటనే లాభాల్లోకి వెళ్లి 58,943 పాయింట్లను టచ్‌ చేసింది. ఆ తర్వాత గంటగంటకి లాభ నష్టాలు ఒకదాని వెంట ఒకటిగా ఆధిక్యం చూపించాయి. చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సెన్సెక్స్‌ని నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్‌తో పోల్చితే నిఫ్టీలో అస్థిరత ఎక్కువగా నమోదైంది. ఓ ఫ్లాట్‌గా ముగుస్తుందని భావించినా చివరకు నష్టాలు తప్పలేదు.

ఫేస్‌బుక్‌ షేర్లు ఢమాల్‌ అనడం రిలయన్స్‌పై ప్రభావం చూపింది. ఫేస్‌బుక్‌ రియలన్స్‌లో పెట్టుబడులు పెట్టడంతో ఇన్వెస్టర్లు ముందు జాగ్రత​‍్తగా రిలయన్స్‌ షేర్ల అమ్మకాలకు మొగ్గు చూపారు. ఫలితంగా మార్కెట్‌కి నష్టాలు తప్పలేదు. ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి. ఇండియా విక్స్‌, సన్‌ఫార్మాలు లాభపడ్డాయి.
 

మరిన్ని వార్తలు